
వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు
॥పల్లవి॥ వట్టియాసలకు లోనై వదలక తిరిగాడేవు బట్టబయలు యీసంసారంబని గుట్టుదెలియలేవు ప్రాణీ ॥చ1॥ చాల నమ్మి యీ సంసారమునకు సోలిసోలి తిరిగేవు బాలయవ్వనప్రౌఢల భ్రమఁబడి లోలుఁడవై తిరిగేవు మేలుదెలియ కతికాముకుండవై మీఁదెఱఁగక తిరిగేవు మాలెమీఁద పరు వెందాఁకా నీమచ్చిక విడువఁగ లేవు ॥చ2॥ మానితముగ దురన్నపానముల మత్తుఁడవై వుండేవు నానావిధములదుష్కర్మంబులు నానాటికి నాటించేవు మేనిలోని యేగురు నార్గురును మిత్రులనుచు నమ్మేవు ఆనందంబున నాకర్మమునకు అధిపతులని తెలియఁగలేవు ॥చ3॥ పామరివై దుర్వ్యాపారమునకుపలుమారునుఁ బొయ్యేవు వేమరు దుర్జనసంగాతంబులు విశ్రామమనుచు నుండేవు ప్రేమముతో హరిదాసులపై సంప్రీతి నిలుపఁగాలేవు తామసమతివయి వేంకటనాథునితత్వ మెఱఁగఁగాలేవు |
రాగము: వరాళి రేకు: 0030-03 సంపుటము: 1-184 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళి