వందే వాసుదేవం

॥పల్లవి॥
వందే వాసుదేవం
బృందారకాధీశ వందిత పదాబ్జం
॥చ1॥
ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ-
చందనాంకితల సచ్చారు దేహం
మందారమాలికా మకుటసంశోభితం
కందర్పజనక మరవిందనాభం
॥చ2॥
ధగధగిత కౌస్తుభాధరణ వక్షస్థలం
ఖగరాజవాహనం కమలనయనం
నిగమాదిసేవితం నిజరూపశేష ప-
న్నగరాజ శాయినం ఘన నివాసం
॥చ3॥
కరిపురనాధ సంరక్షణే తత్పరం
కరిరాజ వరదసంగత కరాబ్జం
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరువేంకటాచలా దేవం భజే
రాగము: శ్రీరాగం
రేకు: 0008-05
సంపుటము: 1-53

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగం

చదవండి :  అన్నియును నతని కృత్యములే

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *