ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు – అన్నమయ్య సంకీర్తన

ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ముచ్చుఁగన్న తల్లి చేరి మూలకు నొదిగినట్టు
తెచ్చిన సంబళ మెల్లఁ దీరుఁబో లోలోనె
॥చ1॥
దప్పముచెడినవాని తరుణి కాఁగిటఁ జేరి
అప్పటప్పటికి నుస్సు రనినయట్టు
వొప్పయిన హరిభక్తి వొల్లనివాని యింటి-
కుప్పలైన సంపదలు కుళ్లుఁబో లోలోనె
॥చ2॥
ఆఁకలి చెడినవాని‌ అన్నము కంచములోన
వోఁకిలింపుచు నేల నొలికినట్టు
తేఁకువైన హరిభక్తి తెరువుగానని వాని-
వేఁకపు సిరులు కొంపవెళ్లుఁబో లోలోనె
॥చ3॥
వొడలుమాసినవాని వొనరుఁజుట్టములెల్ల
బడిబడినే వుండి పాసినయట్టు
యెడయక తిరువేంకటేశుఁ దలఁచనివాని-
ఆడరుబుద్ధులు పగలౌఁబో లోలోననె
రాగము: శ్రీరాగం
రేకు: 0039-04
సంపుటము: 1-240

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం

చదవండి :  అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *