మరో 30 మంది ఎమ్మెల్యులు కలుస్తారు…

ప్రస్తుతం రాజీనామాలు సిద్దపడ్డ ఎమ్మెల్యేలు.. 30 మందితో సహా.. సోమవారం నాటికి.. మరో 30 మంది ఎమ్మెల్యులు కలుస్తారని ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు స్పష్టం చేశారు.

దీనికి సంబంధించిన సంకేతాలు తమకు అందుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
దీంతో కిరణ్ సర్కార్ కూలిపోవడం ఖాయం అని ఆయన అన్నారు. మరో ఆగస్టు సంక్షోభం తప్పదని ఆయన జోస్యం చెప్పారు. వైఎస్ ను అభిమానించే ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తారని ఆయన అన్నారు.

చదవండి :  కేసీ కెనాల్ ఆయకట్టు పరిరక్షణ సమితి ఏర్పాటు

ప్రజాపోరులో జగన్ కు అండగా ఉండేందుకే ఈ రాజీనామాలు చేస్తున్నారని ఆయన అన్నారు. రాజీనామాలు చేసిన నేతలంతా బస్సుయాత్ర చేపట్టి.. ప్రజల్లోకి వెళ్తామని స్పష్టం చేశారు. చనిపోయిన వ్యక్తిని కేసుల్లో ఇరికించడం.. వైఎస్ కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం.. రాజకీయ కక్ష్య జరుగుతుందని వివరించడం వంటివి చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: