
మదమత్సరము లేక మనసుపేదై పో – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ మదమత్సరము లేక మనసుపేదై పో పదరినయాసలవాఁడువో వైష్ణవుఁడు ॥చ1॥ ఇట్టునట్టుఁ దిరిగాడి యేమైనా జెడనాడి పెట్టరంటాఁ బోయరంటాఁ బెక్కులాడి యెట్టివారినైనా దూరి యెవ్వరినైనఁ జేరి వట్టియాసలఁ బడనివాడుఁవో వైష్ణవుఁడు ॥చ2॥ గడనకొరకుఁ జిక్కి కాముకవిద్యలఁ జొక్కి నిడివి నేమైనాఁ గని నిక్కి నిక్కి వొడలిగుణముతోడ వుదుటువిద్యలఁ జాల వడదాఁకి బడలనివాఁడువో వైష్ణవుఁడు ॥చ3॥ ఆవల వొరులఁ జెడనాడఁగ వినివిని చేవమీరి యెవ్వరినిఁ జెడనాడక కోవిదు శ్రీవేంకటేశుఁ గొలిచి పెద్దలకృప వావివర్తనగలవాడుఁవో వైష్ణవుఁడు |
రాగము: ఆహిరి రేకు: 0009-04 సంపుటము: 1-59 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి