
బలువగుఁ దనరూపము చూపె – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ బలువగుఁ దనరూపము చూపె కలదింతయుఁ దనఘన తెఱిఁగించెన్ ॥చ1॥ పాండవరక్షణపరుఁడై నరునకు నండనే తెలిపె మహమహిమ దండి విడిచి తనదయతో నర్జునుఁ- డుండఁగ మగటిమి నొడఁబడఁ బలికె ॥చ2॥ మగుడఁగ కులధర్మములుఁ బుణ్యములు తెగి పార్ధున కుపదేశించె నగుచు నతనితో నానాగతులను నిగమమునియమమునిజ మెరిఁగించెన్ ॥చ3॥ వెరపుమిగుల నావిజయునిమనుమని పరీక్షిత్తుఁ దగఁ బ్రదికించె తిరువేంకటగిరిదేవుఁడు దానై గరిమల బారతకథ గలిగించెన్ |
రాగము: పాడి రేకు: 0048-03 సంపుటము: 1-295 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, పాడి