రాజధాని కోసం ఈ రోజు విద్యాసంస్థల బంద్

విద్యార్థుల ప్రదర్శన

రాజధాని కోసం ఈ రోజు విద్యాసంస్థల బంద్

శ్రీభాగ్ ఒప్పందం మేరకు సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండుతో సోమవారం విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చనట్లు రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు తెలిపారు.

బంద్‌కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి, నాగార్జున యోగివేమన విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు.

ఆర్ఎస్ఎఫ్ బంద్‌కు పిలుపునివ్వడం వెనక ప్రధాన ఉద్దేశం రాజధాని లేకపోతే రాయలసీమకు జరిగే నష్టం వివరించే అన్నీ విషయాలు అందులో పొందుపరిచారు.

బంద్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొనాలని వారు కోరారు.

చదవండి :  6న అఖిలపక్షం కలెక్టరేట్ ముట్టడి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: