పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణిని

పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణిని

॥పల్లవి॥
పోయఁ గాలం బడవికిఁ గాయు వెన్నెలకరణిని
శ్రీయుతుఁ దలఁచుఁడీ నరులు మాయఁబడి చెడక
open
॥చ1॥
చిత్తము చేకూరుచుకొని చిత్తైకాగ్రతను
చిత్తజగురునిఁ దలఁచుఁడీ చిత్తజుఁ జొరనీక
॥చ2॥
బూరుగుమాఁకునఁ జెందినకీరముచందమున
ఆరయ నిష్పలమగు మరి యన్యులఁ జేరినను
॥చ3॥
కూరిమి మాతిరువేంకటగిరి గురుశ్రీ పాదములు
చేరినవారికి భవములు చెంద వెపుడు నటుగాన
రాగము: కన్నడగౌళ
రేకు: 0031-07
సంపుటము: 1-194

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, కన్నడగౌళ

చదవండి :  ఏమి గలదిందు నెంత గాలంబైన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *