పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి – అన్నమయ్య సంకీర్తన

పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి
ఇంచుకంత తాలిముల కెడలేనిచెలిమి
॥చ1॥
అంటుముట్టులేక మనసులంటుకొన్న చెలిమి
కంటఁగంట నవ్వించేఘనమైనచెలిమి
వెంటవెంటఁ దిరిగాడు వెఱ్ఱిగొన్న చెలిమి
యింటివారిచిత్తములకు నెడరైనచెలిమి
॥చ2॥
చెక్కుచెమట పెక్కు వలనే చిక్కనై నచెలిమి
యెక్కడౌటా తమ్ముఁదమ్ము నెఱఁగనీనిచెలిమి
చక్కఁదనమే చిక్క మేనుచిక్కినట్టిచెలిమి
లెక్కలేని యాసలెల్ల లేఁతలయినచెలిమి
॥చ3॥
అంకురించినట్టితలఁపు లధికమయినచెలిమి
లంకెలయినయాసలెల్లా లావుకొన్న చెలిమి
వేంకటాద్రివిభునిఁ గూడి వేడుకయినచెలిమి
పంకజాననలకెల్లఁ బాయరానిచెలిమి
రాగము: ఆహిరి
రేకు: 0005-01
సంపుటము: 1-29

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఇన్ని లాగులచేతు లివియపో కడు-

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: