
పుడమినిందరి బుట్టె భూతము కడుఁ-
॥పల్లవి॥ పుడమినిందరి బుట్టె భూతము కడుఁ- బొడవైన నల్లని భూతము ॥చ1॥ కినిసి వోడమింగెడి భూతము పునుకవీఁపుపెద్ద భూతము కనలి కలియు చీఁకటి భూతము పొనుగుసోమపుమోము భూతము ॥చ2॥ చేటకాళ్ళా మించిన భూతము పోటుదారల పెద్ద భూతము గాఁటపుజడలబింకపు భూతము జూటరి నల్లముసుఁగు భూతము ॥చ3॥ కెలసి బిత్తలేతిరిగేటి భూతము పొలుపుదాంట్లపెద్ద భూతము బలుపు వేంకటగిరిపయి భూతము పులుగుమీఁది మహా భూతము |
రాగము: వరాళి రేకు: 0018-03 సంపుటము: 1-109 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళి