పుట్టగులమ్మీ భువిఁ గొనరో

॥పల్లవి॥
పుట్టగులమ్మీ భువిఁ గొనరో
జట్టికిని హింసలే మీ ధనము
open
open
॥చ1॥
ఆపద లంగడి నమ్మీఁ గొనరో
పాపాత్ములు పై పయిఁ బడకా
కైపులఁ బుణ్యులఁగని కోపించే-
చూపులు మీ కివి సులభపు ధనము
॥చ2॥
కడుఁగుంభీ పాతకంబులు గొనరో
బడిబడి నమ్మీఁ బాలిండ్ల
తొడరుఁ బరస్త్రీ ద్రోహపుధనములె
తడవుటె మీ కివి దాఁచిన ధనము
॥చ3॥
లంపుల చండాలత్వము గొనరో
గంపలనమ్మీఁ గలియుగము
రంపపు వేంకటరమణునికథ విన-
నింపగు వానికి నిదే ధనము
రాగము: ధన్నాసి
రేకు: 0006-06
సంపుటము: 1-42

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసి

చదవండి :  అన్నమయ్య కథ (మొదటి భాగం)

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *