పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు – అన్నమయ్య సంకీర్తన

పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పుండు జీవుల కెల్లఁ బుట్టక మానదు
పుండు మాన మందు వొయఁగదయ్య
॥చ1॥
నెత్తురు నెమ్ములు నిండినపుంటికి
తిత్తిలో సోదించనేరా
నిత్తెమూ వేనీళ్లఁ గడిగినాను
మత్తిలి వుబ్బు మానదేలయ్యా
॥చ2॥
చల్లఁగూడు వెట్టి చల్లఁగా పొత్తు
లెల్లఁ బెట్టి బిగియించఁగాను
కల్లగాదు చీము గారు తొమ్మిదిగండ్ల
పిల్లలాఁ జాలఁ బెట్టెఁగదయ్యా
॥చ3॥
ఆదినుండి పాకమైనది యెవ్వ-
రేదిరో మొక మేరుపడదు
ఆదరించి వేంకటాధిప నీవింక
సోదించి మానఁజూడఁగదయ్యా
రాగము: కన్నడగౌళ
రేకు: 0042-03
సంపుటము: 1-257

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, కన్నడగౌళ

చదవండి :  నిత్యానంద ధరణీధర ధరారమణ

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *