రేపటి నుంచి పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు

రేపటి నుంచి పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు

చిన్నర్సుపల్లెలో సద్గురు పీరయ్యస్వామి ఆరాధనోత్సవాలు ఈనెల 15 నుంచి నిర్వహిస్తున్నట్టు పీఠాధిపతి నాగలింగమయ్య తెలిపారు. మకర సంక్రాంతి నాడు ఉదయం నుంచే స్వామివారి జీవసమాధికి పుష్పాలంకరణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.

పగలంతా ప్రత్యేక కార్యక్రమాలుంటాయని, రాత్రికి స్వామివారి పేరుతో కాలమానిని ఆవిష్కరణ జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం కొండమూల చౌడేశ్వరీమాత వూరేగింపు, పెద్దమండెం మండలం నుంచి వచ్చే దేవరెద్దు ప్రదర్శనతో పాటు చింతామణి, సత్యహరిశ్చంద్ర నాటకాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

16న ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జెండా వూరేగింపు, మొక్కుల చెల్లింపు కార్యక్రమాలుంటాయన్నారు. ఈ సందర్భంగా అన్నదానం ఏర్పాటుచేస్తున్నట్టు తెలిపారు.

చదవండి :  మాధవరంపోడులో గబ్బిలాలకు పూజలు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: