పాయపుమదముల బంధమా మము – అన్నమయ్య సంకీర్తన

పాయపుమదముల బంధమా మము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పాయపుమదముల బంధమా మము
జీయని యిఁకఁ గృపసేయఁగదో
॥చ1॥
ధనధాన్యములై తనులంపటమై
పనిగొంటివి నను బంధమా
దినదినంబు ననుతీదీపులఁ బెను-
గనివైతివి యిఁక గావఁగదో
॥చ2॥
సతులై సుతులై చలమై కులమై
పతివైతివి వోబంధమా
రతిఁ బెరరేఁపుల రంతులయేఁపుల
గతిమాలితి విఁక గావఁగదో
॥చ3॥
పంటై పాఁడై బలుసంపదలై
బంటుగ నేలితి బంధమా
కంటి మిదివో వేంకటగిరిపై మా-
వెంటరాక తెగి విడువఁగదో
రాగము: సామంతం
రేకు: 0039-02
సంపుటము: 1-238

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  అటు గుడువు మనస నీ వన్నిలాగులఁ బొరలి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *