పాయని కర్మంబులె – అన్నమయ్య సంకీర్తన

పాయని కర్మంబులె – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
పాయని కర్మంబులె కడుబలవంతము లనినప్పుడె
కాయమునకు జీవునకునుఁ గర్తృత్వము లేదు
॥చ1॥
ఆతుమ కలవ్యాపకమని తలపోసినపిమ్మట
జాతియుఁ గులాభిమానముఁ జర్చింపనెరాదు
భూతవికారములన్నియుఁ బురుషోత్తముఁ డనినప్పుడు
పాతకముల పుణ్యంబులపని తనకే లేదు
॥చ2॥
పదిలంబుగ సర్వాత్మకభావము దలఁచినపిమ్మట
ముదమున నెవ్వరిఁ జూచినఁ మొక్కకపోరాదు
కదిసిన యిప్పటి సుఖములె కడుదుఃఖములని తెలిసిన
చెదరక సంసారమునకు జేసాఁపనెరాదు
॥చ3॥
పరిపూర్ణుఁడు తిరువేంకటపతియనఁగా వినినప్పుడు
యెరవుల హీనాధికములు యొగ్గులు మరి లేవు
పరమాత్ముండగు నీతని భక్తులందలఁచిన యప్పుడు
తిరముగ నీతనికంటెను దేవుఁడు మరి లేఁడు
రాగము: సామంతం
రేకు: 0007-03
సంపుటము: 1-47

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం

చదవండి :  పెంచఁబెంచ మీఁదఁ బెరిగేటిచెలిమి

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: