
పాపములే సంబళమెపుడూ యీ- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పాపములే సంబళమెపుడూ యీ- యాపదఁబడి నే నలసేనా ॥చ1॥ ఎన్నిపురాణము లెటువలె విన్నా మన్న మనువు దిమ్మరితనమే నన్ను నేనే కానఁగలేనట నా విన్న వినుకులకు వెఱచేనా ॥చ2॥ యెందరు వెద్దల నెట్లఁ గొలిచినా నిందల నామతి నిలిచీనా కందువెఱిఁగి చీకటికిఁ దొలఁగనట అందపుఁబరమిఁక నందేనా ॥చ3॥ తిరువేంకటగిరిదేవుఁడే పరమని దరి గని తెలివిఁక దాఁగీనా తిరముగ నినుఁ జింతించినచింతే నిరతము ముక్తికి నిధిగాదా |
రాగము: శంకరాభరణం రేకు: 0013-06 సంపుటము: 1-82 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం