
పరుసము సోఁకియు బ్రదుకవద్దా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పరుసము సోఁకియు బ్రదుకవద్దా తిరిగి కర్మము లింక తీదీపులా ॥చ1॥ పడిగాలువడియున్న ప్రాణచారముల- పడఁతుల నధములఁ బాలించితి యిడుమలఁ బెడఁబాప నింకనేల తెగి కొంక గడిచీటిచ్చియు నింకఁ గడ మున్నదా ॥చ2॥ మితిలేనిధనములు మెరసి కానుకగొని అతిపుణ్యలిందరి నలరించితి ధృతిహీనులకునెల్ల దిక్కయి కాతువుగాక వ్రతముచెల్లిన నింక వట్టఁగట్లా ॥చ3॥ పాలించి నావిన్నపమున వేంకటరాయ లాభించితివి నే నీలలనఁగానా యీలాగుననె లోకమింతాఁ గాతువుగాక పాలుదాగినమీఁదఁ బైకుడుపులా |
రాగము: శంకరాభరణం రేకు: 0046-01 సంపుటము: 1-280 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం