
పరులసేవలు చేసి బ్రదికేరటా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ పరులసేవలు చేసి బ్రదికేరటా సిరివరుదాసులు సిరులందు టరుదా ॥చ1॥ కోరి వొక నరునిఁ గొలిచిన వారలు దీరులై సలిగెలఁ దిరిగేరట కూరిమి బ్రహ్మండ కోటులేలెడివాని- వార లింతటఁ జనవరులౌ టరుదా ॥చ2॥ చేకొన్న తుమ్మిద చేపడ్డ కీటము – లాకడఁ దుమ్మిదలయ్యీనట శ్రీకాంతుని పాదసేవకులగు వార – లేకులజు లయినా నెక్కుడౌ టరుదా ॥చ3॥ ధరణీశు నాజ్ఞల తమదేశములందు సిరులనాణెపు ముద్ర చెల్లీనట తిరువేంకటాద్రి శ్రీదేవుని ముద్రలు ధరియింపఁగా నింతటఁ జెల్లు టరుదా |
రాగము: దేసాళం రేకు: 0081-03 సంపుటము: 1-390 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాళం