
నేరిచిబ్రదికేవారు నీదాసులు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నేరిచిబ్రదికేవారు నీదాసులు నేరమిఁ బాసినవారు నీదాసులు ॥చ1॥ కామముఁ గ్రోధము రెంటీఁ గాదని విడిచి మంచి- నేమము వట్టినవారే నీదాసులు దోమటి బాపపుణ్యాలఁ దుంచివేసి చూడగాఁనే నీమాయ గెలిచినారు నీదాసులు ॥చ2॥ కిక్కిరించిన యాసలఁ గిందవేసి మోక్షము నిక్కి నిక్కి చూచేవారు నీదాసులు వెక్కసపు భక్తితోడ వెఱపు మఱపు లేక నెక్కొన్న మహిమవారు నీదాసులు ॥చ3॥ అట్టె వేదశాస్త్రముల అర్థము దేటపఱచి నెట్టుకొని మించినారు నీదాసులు యిట్టె శ్రీవేంకటేశ యితరమార్గములెల్లా నెట్టువడఁ దోసినారు నీదాసులు |
రాగము: సాళంగం రేకు: 0098-05 సంపుటము: 1-493 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సాళంగం