
నెరవాది సాహసులు నిత్యశూరులు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నెరవాది సాహసులు నిత్యశూరులు దురితవిదూరులు ధ్రువాదులు ॥చ1॥ తక్కక శ్రీహరిభక్తితాపలు సేసి యెక్కిరి చక్కఁగా వైకుంఠము సనకాదులు వొక్కట విష్ణుకథలు వోడసేసుక దాఁటిరి పెక్కుసంసారజలధి భీష్మాదులు ॥చ2॥ కడువిరక్తియనేటికత్తులనే నరకిరి నడుమ భవపాశముల నారదాదులు బడినే హరిదాసులపౌఁజుల గూడుకొనిరి నుడివడ కిహమందే శుకాదులు ॥చ3॥ పరమశాంతములనే పట్టపేనుగులమీద వరుసల నేఁగేరు వ్యాసాదులు సిరుల శ్రీవేంకటేశుఁ జేరి సుఖముఁ బొందిరి బెరసి దాస్యమున విభీషణాదులు |
రాగము: శంకరాభరణం రేకు: 0098-02 సంపుటము: 1-490 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం