నీ కథామృతము నా నిరతసేవన నాకు

॥పల్లవి॥
నీ కథామృతము నా నిరతసేవన నాకు
చేకొనుట సకలసంసేవనం బటుగాన
॥చ1॥
ఇదియె మంత్రరాజము నాకు నేప్రొద్దు-
నిదియె వేదసంహితపాఠము
యిదియె బహుశాస్త్రమెల్లఁ జదువుట నాకు-
నిదియె సంధ్య నాకిదియ జప మటుగాన
॥చ2॥
యిదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు-
నిదియె దుఃఖవిరహితమార్గము
యిదియె భవరోగహితభేషజము నాకు-
నిదియె వుపనిషద్వాక్యపద్దతిగాన
॥చ3॥
యిదియె దానఫల మీఁజాలినది నాకు
యిదియే తలఁపఁ బరహితకర్మము
యిదియె తిరువేంకటేశ నీసంస్మరణ-
మిదియె యిదియె ఇన్నియును నటుగాన
రాగము: భూపాళం
రేకు: 0008-06
సంపుటము: 1-54

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భూపాళం

చదవండి :  శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణా

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: