
నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ నిగమనిగమాంత వర్ణిత మనోహర రూప నగరాజధరుఁడ శ్రీనారాయణా ॥చ1॥ దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య- నోపకకదా నన్ను నొడఁబరుపుచు పైపైనె సంసారబంధములఁ గట్టేవు నాపలుకు చెల్లునా నారయణా ॥చ2॥ చీకాకు పడిన నాచిత్తశాంతము సేయ- లేకకా నీవు బహులీల నన్ను కాకుసేసెదవు బహుకర్మములఁ బడువారు నాకొలఁదివారలా నారాయణా ॥చ3॥ వివిదనిర్బంధముల వెడలఁద్రోయక నన్ను భవసాగరములఁ దడఁబడఁ జేతురా దివిజేంద్రవంద్య శ్రీతిరువేంకటాద్రీశ నవనీతచోర శ్రీనారాయణా |
రాగము: సామంతం రేకు: 0040-01 సంపుటము: 1-243 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం