నదు లొల్లవు నా స్నానము కడు- – అన్నమయ్య సంకీర్తన

నదు లొల్లవు నా స్నానము కడు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
నదు లొల్లవు నా స్నానము కడు-
సదరము నాకీ స్నానము
॥చ1॥
ఇరువంకల నీయేచినముద్రలు
ధరియించుటే నాస్నానము
ధరపై నీనిజదాసులదాసుల-
చరణధూళి నాస్నానము
॥చ2॥
తలఁపులోన నినుఁదలఁచినవారలఁ
దలఁచుటే నాస్నానము
వలనుగ నినుఁగనువారల శ్రీపాద-
జలములే నాస్నానము
॥చ3॥
పరమభాగవతపాదాంబుజముల-
దరుశనమే నాస్నానము
తిరువేంకటాగిరిదేవ నీకథా
స్మరణమే నాస్నానము
రాగము: ముఖారి
రేకు: 0008-03
సంపుటము: 1-51

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  చెయ్యరాని చేతల వోచెన్నకేశ్వరా - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: