నదు లొల్లవు నా స్నానము కడు-
॥పల్లవి॥ నదు లొల్లవు నా స్నానము కడు- సదరము నాకీ స్నానము mebendazol dosierung mebendazol uden recept mebendazol overdosering ॥చ1॥ ఇరువంకల నీయేచినముద్రలు ధరియించుటే నాస్నానము ధరపై నీనిజదాసులదాసుల- చరణధూళి నాస్నానము ॥చ2॥ తలఁపులోన నినుఁదలఁచినవారలఁ దలఁచుటే నాస్నానము వలనుగ నినుఁగనువారల శ్రీపాద- జలములే నాస్నానము ॥చ3॥ పరమభాగవతపాదాంబుజముల- దరుశనమే నాస్నానము తిరువేంకటాగిరిదేవ నీకథా స్మరణమే నాస్నానము |
రాగము: ముఖారి రేకు: 0008-03 సంపుటము: 1-51 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి