
దైవమా పరదైవమా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దైవమా పరదైవమా యేవగింతలు నాకు నెట్టు దెచ్చేవో ॥చ1॥ పాపకర్మునిఁ దెచ్చి పరమియ్యఁదలఁచిన మేపులకే పోక మెయుకొనీనా తీపులు రూపులుఁ దివిరి నా వెనువెంట- నేపొద్దు నీ వేఁడఁ దెచ్చేవో ॥చ2॥ అధమాధమునిఁ దెచ్చి యధికుని జేసేనంటే విధినిషేధములు వివరించునా నిధినిధానములు నిచ్చనిచ్చలుఁ బెక్కు- విధముల నెటువటె వెదచల్లెదవో ॥చ3॥ అతికష్టుఁడగునాకు నలవిగానియీ- మత మొఁసగిన నేను మరిగేనా ప్రతిలేని వేంకటపతి నీదునామా- మృత మిచ్చి నను నీవే మెరయింతుగాక |
రాగము: లలిత రేకు: 0047-06 సంపుటము: 1-291 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత