
దేవ నీవిచ్చేయందుకు దీనికిఁగా నింతయేల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ దేవ నీవిచ్చేయందుకు దీనికిఁగా నింతయేల యేవేళ మాయెరుకలు యెందుకుఁ గొలువును ॥చ1॥ యెవ్వరివసములు బుద్దెరిఁగినడచేమన యివ్వల నారాయణ నీవియ్యక లేదు దవ్వు చేరువ మనసు తనయిచ్చయితేఁ గనక రవ్వగ మృగాదులెల్ల రాజ్యమేలనేరవా ॥చ2॥ సారేకు నిన్నుఁదలపించ జంతువులవసమా కేరి నీవు జిహ్వఁ బరికించఁగాఁగాక యీరీతి లోకమెల్లాఁ దమయిచ్చకొలఁదులనయితే దూరానఁ గొక్కెరలు చదవవా వేదాలు ॥చ3॥ యిందరిపాపపుణ్యాలు యిన్నియు నీచేఁతలే కుందవ స్వతంత్రులు గారు గాన చందపు శ్రీవేంకటేశ శరణంటి నిదె నీకు చెంది నీవే కాతుగాక చేఁతలూను వలెనా |
రాగము: బౌళి రేకు: 0078-03 సంపుటము: 1-372 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి