
తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తెలిసియు నత్యంతదీనుఁడై తన్నుఁ దెలియఁగఁగోరేటి తెలివే పో తెలివి read ॥చ1॥ వలచినసతి దన్ను వడిఁ గాలఁదన్నిన అలరి యెట్లా నుబ్బు నటువలెనే తలఁక కెవ్వరు గాలఁదన్నినా మతిలోన అలుగక ముదమందునదివో తెలివి ॥చ2॥ అరిది మోహపు వనిత ఆలిపైఁ దిట్టిన… నరవిరై చొక్కినయుటవలెనే పరులు దన్ను వెలుపల నిట్లఁ బలికిన ఆరలేక రతిఁ జొక్కునదివో తెలివి ॥చ3॥ తనివోక ప్రియకాంత తమ్ములపురస మాన…. ననయమును నటు గోరునటువలెనే తనర వేంకటపతిదాసుల ప్రసాదంబు ఆనిశము ను గొనఁగోరునదివో తెలివి |
రాగము: బౌళి రేకు: 0064-03 సంపుటము: 1-330 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి