
తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన
॥పల్లవి॥ తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన లోనఁ బెట్టుకొని మాకు లోనైనవాఁడు ॥చ1॥ చదవించి, కూడవెట్టి, జారకుండ నిల్లుగట్టి బెదురులేని బుద్ది పిన్ననాఁడే చెప్పి యెదరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చి పదిలమై తమ్ముఁ బాలించువాఁడు ॥చ2॥ మోహవియోగమ్ము, మొహానురాగమ్ము దేహవిబాగంబు దెలిపిని కలికి ఐహికమున వేంకటాధీశుఁడై సర్వ దేహరక్షకుఁడై తిరుగుచున్నాఁడు |
రాగము: సామంతం రేకు: 0031-05 సంపుటము: 1-192 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం