
తహతహ లిన్నిటికి తానే మూలము గాన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ తహతహ లిన్నిటికి తానే మూలము గాన సహజాన నూరకున్న సంతతము సుఖము ॥చ1॥ భారమైన పదివేలు పనులు గడించుకొంటే సారెసారె నలయించకపోవు తీరనియాసోదము దేహములో నించుకొంటే వూరూరఁ దిప్పితిప్పి వొరయక మానవు ॥చ2॥ వుండివుండి కిందుమీఁదు వుపమఁ జింతించుకొంటే వుండుఁబో మంచముకింద నొకనూయి కొండంతదొరతనము కోరి మీఁద వేసుకొంటే నండనే యాబహురూప మాడకపోదు ॥చ3॥ మనసురానివైన మంచివి చేసుకొంటే తినఁదిన వేమైన దీపవును తనిసి శ్రీవేంకటేశు దాసానదాసుఁడైతే యెనయుచు నేపని కెదురే లేదు |
రాగము: లలిత రేకు: 0086-01 సంపుటము: 1-417 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత