5న భాజపా ఆధ్వర్యంలో ఛలో సిద్దేశ్వరం
కడప: కర్నూలు జిల్లా సిద్ధేశ్వరం వద్ద అలుగు నిర్మించాలని, గుండ్రేవుల వద్ద బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనే డిమాండ్ తో రేపు (మే 5న) భాజపా ఆధ్వర్యంలో ‘ఛలో సిద్ధేశ్వరం’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు బీజేవైఎం జాతీయ కార్యవర్గసభ్యుడు నాగోతు రమేష్ తెలిపారు.
మంగళవారం రాజంపేటలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ రెండు ప్రాంతాల్లో అలుగు, బ్యారేజీ నిర్మాణం వల్ల రాయలసీమకు సుమారు 40 టీఎంసీల నీరు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. వీటిని నిర్మించాలని భాజపా గతంలో ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు.
ఇప్పటికే సీమలో 80 శాతం పూర్తయిన సాగునీటి పథకాలను పూర్తిచేయడానికి కేంద్రం నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తామన్నారు.
పోయిన సంవత్సరం కరవు, ప్రాజెక్టుల స్థితిగతులపై తాము ఇచ్చిన నివేదిక ఆధారంగానే కేంద్రం నిధులు విడుదలచేసినట్టు చెప్పారు. ఈనెల 4న జిల్లా కరవు సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేస్తామని, 5న క్షేత్రస్థాయిలో ఆయా ప్రాంతాలను సందర్శించనున్నట్టు తెలిపారు.