
చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె
॥పల్లవి॥ చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె ఆదలించి తగదు నీ కనువారు వేరీ link ॥చ1॥ చిత్త మింద్రియములచేఁ జిక్కి , కడు మద- మెత్తిన వద్దన నిఁక వేరీ హత్తినమనసు మోహాదులతోఁ గూడి తత్తరించిన మాన్పఁదగువారు వేరీ ॥చ2॥ జీవుఁడిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁ బోవఁజొచ్చిన బుద్ధిపొల మేది శ్రీవేంకటేశుని చింతాపరతఁ గాని కావఁగ నాత్మకు గతి దానేది |
రాగము: బౌళి రేకు: 0031-06 సంపుటము: 1-193 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళి