
చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి
॥పల్లవి॥ చూడఁజూడ మాణిక్యాలు చుక్కలవలె నున్నవి యీడులేని కన్నులవె యిన చంద్రులు voltaren végbélkúp voltaren végbélkúp voltaren szemcsepp ॥చ1॥ కంటిఁగంటి వాఁడెవాఁడె ఘనమైన ముత్యాల కంటమాలలవే పదకములు నవె మింటి పొడవైనట్టి మించుఁ గిరీటంబదె జంటల వెలుఁగు శంఖచక్రా లవె ॥చ2॥ మొక్కుమొక్కు వాఁడెవాఁడె ముందరనే వున్నాఁడు చెక్కులవే నగవుతో జిగిమో మదె పుక్కిట లోకములవె భుజకీర్తులును నవె చక్కనమ్మ అలమేలు జవరాలదె ॥చ3॥ ముంగైమురాలును నవె మొలకఠారును నదె బంగారు నిగ్గులవన్నె పచ్చబట్టదె యింగితమెరిఁగి వేంకటేశుఁడిదె కన్నులకు ముంగిటి నిధానమైన మూలభూతమదె |
రాగము: వరాళి రేకు: 0022-03 సంపుటము: 1-133 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, వరాళి