
చీచీ నరుల దేటిజీవనము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చీచీ నరుల దేటిజీవనము కాచుక శ్రీహరి నీవే కరుణింతుగాక read read ॥చ1॥ అడవిలో మృగజాతియైనఁ గావచ్చుఁగాక వడి నితరులఁ గొలువఁగవచ్చునా వుడివోని పక్షియై వుండనై నావచ్చుఁ గాక విడువ కెవ్వరినైనా వేఁడవచ్చునా ॥చ2॥ పసురమై వెదలేనిపాటు వడవచ్చుఁ గాక కసివో నొరుల బొగడగావచ్చునా వుసురుమానై పుట్టివుండనై నవచ్చుగాక విసువక వీరివారి వేసరించవచ్చునా ॥చ3॥ యెమ్మెల బుణ్యాలు సేసి యిల యేలవచ్చుఁగాక కమ్మి హరిదాసుఁడు గావచ్చునా నెమ్మది శ్రీవేంకటేశ నీచిత్తమే కాక దొమ్ములకర్మము లివి తోయవచ్చునా |
రాగము: శంకరాభరణం రేకు: 0082-05 సంపుటము: 1-397 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శంకరాభరణం