
చిరంతనుఁడు శ్రీవరుఁడు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చిరంతనుఁడు శ్రీవరుఁడు పరమం భవ్యం పావనం ॥చ1॥ వేదమయుఁడు కోవిదుఁడమలుఁడు పరుఁ- డాది పురుషుఁడు మహామహుఁడు యేదెస నేమని యేది దలఁచిన న- ఖేద మవాద మఖిల సమ్మతం ॥చ2॥ నిఖిలనిలయుఁడు మునివరదుఁడధికుఁడు మఖముఖ శుకాభిమతరతుఁడు శిఖరం శివం సుశీలన మతిశయ- ముఖరం ముఖ్యం మూలమిదం ॥చ3॥ అనేకప్రదుఁ డనాది నిధనుఁడు ఘనుఁడీ తిరువేంకటవిభుఁడు దినం దినం సముదిత రవికోటి భ- జనం సిద్ధాంజనం ధనం |
రాగము: ముఖారి రేకు: 0064-06 సంపుటము: 1-333 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి