చిత్తములో నిన్నుఁ జింతించనేరక

చిత్తములో నిన్నుఁ జింతించనేరక

॥పల్లవి॥
చిత్తములో నిన్నుఁ జింతించనేరక
మత్తుఁడఁనై పులుమానిసినైతి
॥చ1॥
అరుత లింగము గట్టి యది నమ్మఁజాలక
పరువతమేఁగిన బత్తుడఁ నైతి
సరుస మేఁకపిల్లఁ జంకఁబెట్టుక నూఁత-
నరయు గొల్లనిరీతి నజ్ఞాని నైతి
॥చ2॥
ముడుపు కొంగునఁగట్టి మూలమూలలవెదకే-
వెడమతినై నే వెర్తుడ నైతి
విడువ కిక్కడ శ్రీవేంకటేశ్వరుఁ డుండ
పొడగానక మందబుద్ధి నేనైతి
రాగము: ముఖారి
రేకు: 0003-06
సంపుటము: 1-19

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారి

చదవండి :  ఏమి నీకింత బలువు - పెదతిరుమలయ్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *