
చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చాల నొవ్వి నేయునట్టిజన్మమేమి మరణమేమి మాలుగలపి దొరతనంబు మాన్పు టింత చాలదా ॥చ1॥ పుడమిఁ బాపకర్మమేమి పుణ్యకర్మమేమి తనకు కడపరానిబంధములకుఁ గారణంబులైనవి యెడపకున్న పసిఁడిఁసంకెలేమి యినుపసంకెలేమి మెడకుఁ దగిలియుండి యెపుడు మీఁదుచూడరానివి ॥చ2॥ చలముకొన్న ఆపదేమి సంపదేమి యెపుడుఁ దనకు అలమిపట్టి దు: ఖములకు నప్పగించినట్టిది యెలమిఁ బసిఁడిగుదియయేమి యినుపగుదియయేమి తనకు ములుగ ములుగఁ దొలితొలి మోఁదు టింత చాలదా ॥చ3॥ కర్మియైనయేమి వికృతకర్మియైననేమి దనకు కర్మఫలముమీఁదకాంక్ష గలుగు టింత చాలదా మర్మ మెరిఁగి వేంకటేశుమహిమలనుచుఁ దెలిసినట్టి నిర్మలాత్ము కిహముఁ బరము నేఁడు గలిగెఁ జాలదా |
రాగము: భైరవి రేకు: 0048-04 సంపుటము: 1-297 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి