
చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు జాలెల్ల నడఁగించు సంకీర్తనం ॥చ1॥ సంతోషకరమైన సంకీర్తనం సంతాపమణఁగించు సంకీర్తనం జంతువుల రక్షించు సంకీర్తనం సంతతముఁ దలచుఁడీ సంకీర్తనం ॥చ2॥ సామజముఁ గాంచినది సంకీర్తనం సామమున కెక్కుడీ సంకీర్తనం సామీప్య మిందరికి సంకీర్తనం సామాన్యమా విష్ణు సంకీర్తనం ॥చ3॥ జముబారి విడిపించు సంకీర్తనం సమబుద్ధి వొడమించు సంకీర్తనం జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం శమదమాదులఁ జేయు సంకీర్తనం ॥చ4॥ జలజాసనునినోరి సంకీర్తనం చలిగొండసుతదలఁచు సంకీర్తనం చలువ గడు నాలుకకు సంకీర్తనం చలపట్టి తలఁచుఁడీ సంకీర్తనం ॥చ5॥ సరవి సంపదలిచ్చు సంకీర్తనం సరిలేని దిదియపో సంకీర్తనం సరుస వేంకటవిభుని సంకీర్తనం సరుగననుఁ దలఁచుఁడీ సంకీర్తనం |
రాగము: సామంతం రేకు: 0066-04 సంపుటము: 1-343 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం