ఆదివారం , 22 డిసెంబర్ 2024

కోస్తా నాయకులను నమ్మొద్దు!

కడప: రాయలసీమలోనే రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండు చేయాల్సిన సమయంలో మేథోవర్గం మౌనం వహించడం ప్రమాదకరమని రాయలసీమ విద్యార్థి సమాఖ్య కన్వీనరు మల్లెల భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు.

నగరంలోని శ్రీ వెంటేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఆర్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ‘రాయలసీమకు రాజధానిని అడుగుదామా.. మరణశాసనం రాసుకుందామా’ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. సదస్సునకు సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి అధ్యక్షత వహించారు.

భాస్కర్ మాట్లాడుతు కోస్తా పెట్టుబడిదారులు, రాయలసీమ ముఠానాయకులు కలసి 1956లో రాసిన మరణశాసనం నుంచి సీమ వాసులు విముక్తి పొందాలంటే రాజధాని ఇక్కడే ఏర్పాటు చేయాలన్నారు.

చదవండి :  'పెన్నేటి పాట'కు రాళ్ళపల్లి కట్టిన పీఠిక

కోస్తా నాయకులు ఇన్నాళ్లూ సీమ ప్రజలను సమైక్య మత్తులో ఉంచి వారు మాత్రమే కేంద్రం వద్ద హైదరాబాద్‌కు ధీటైన హామీలను పొందారని వివరించారు. రాజధాని సీమ ప్రజల హక్కు అనే విషయం మరచి పోవద్దన్నారు.

1913 నుంచి నీరు, నిధులు, ఉద్యోగాల్లో సీమ ప్రజలను వెనక్కినెట్టేసిన కోస్తా నాయకులను ఇక నమ్మొద్దన్నారు. సమాఖ్య జిల్లా కోకన్వీనరు లెనిన్ ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన తంతు సాగుతున్న సందర్భంలో కోస్తా ప్రాంతానికి మంజూరైన పథకాలను ప్రస్తావించారు.

చదవండి :  రాజధానికి నీటిని తరిలించేందుకే 'పట్టిసీమ' : బివిరాఘవులు

సీమకు ఏ ఒక్క ప్రయోజనమూ చేకూరదని ఆందోళన చెందారు. ప్రత్యేక హోదా వల్ల ఒనగూరేదేమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో స్నాతకోత్తర విద్యార్థులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – మొదటి భాగం

రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: