కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు- – అన్నమయ్య సంకీర్తన

కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కొనుట వెగ్గళము దాఁ దినుట యల్పము మీఁదు-
గనుట వినుట లేక దా కడచన్నభవము
॥చ1॥
ఆపద వడ్డికినిచ్చి అనుభవింపఁబోయిన
యేపున నెవ్వరికి నిం దేమిగలదు
పాపపుపైరు విత్తినపండిన పంటలలోన
రూపింపఁగ నిందు రుచి యేమిగలదూ
॥చ2॥
ఘనుఁడైనతిరువేంకటనాథుఁ డిన్నిటికి-
యును భోక్తయుఁ గర్మియును నైనవాఁడు
పనిలేదు నిష్ఠూరపరుఁడు దానై వుండు
తనకుఁ దానె కర్త తనమౌటఁ గాన
రాగము: గుండక్రియ
రేకు: 0008-01
సంపుటము: 1-49

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, గుండక్రియ

చదవండి :  దైవము పుట్టించినట్టి తన సహజమే కాక - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: