
కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కొండ దవ్వుట యెలుక గోరిపట్టుట దీన బండాయ సంసారబంధము ॥చ1॥ వెలయఁ జిత్తంబునకు వేరుపురువై బుద్ధిఁ గలఁగించె మోహవికారము కలకాలమునకు లింగము మీఁది యెలుకయై తలకొనియె నాత్మ పరితాపము ॥చ2॥ అరయఁ జంచలముచే నాలజాలంబువలెఁ దిరుగదొరకొనియెఁ దనదేహము తిరువేంకటాచలాధిపుని మన్ననఁగాని పరిపాటిఁ బడదు తనభావము |
రాగము: బౌళి రేకు: 0062-06 సంపుటము: 1-321 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి