కింకదీర ‘నదైవం కేశవాత్పర’ మని – అన్నమయ్య సంకీర్తన

కింకదీర ‘నదైవం కేశవాత్పర’ మని – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
కింకదీర ‘నదైవం కేశవాత్పర’ మని
ఉంకువైవనాలో నీవుపమ లివే
॥చ1॥
కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమని
వొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గాన
వింటి నీవే ఘనమని వేదాంతమందు నీ-
కంటె నితరము విన గరుణానిధీ
॥చ2॥
తోఁచె నాకు నీసేవే తుదిపదమని మఱి
తోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందును
పూఁచి నాగురుఁడు నిన్నే బోధించేగాని మఱి
దాఁచఁడాయ నీమహిమ ధరణిధరా
॥చ3॥
సమ్మతించె నామతి జవియైనా కథలె
సమ్మతించ దెక్కడో రచ్చల సుద్దులు
నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలే
నమ్మితి నేమియు నమ్మ నారాయణా
రాగము: ధన్నాసి
రేకు: 0082-03
సంపుటము: 1-395

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ధన్నాసి

చదవండి :  కాకున్న సంసారగతులేల - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: