
కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు కడలేని మనసునకుఁ గడమ యెక్కడిది ॥చ1॥ దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్న దాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగు దేహంబుగలయన్ని దినములకుఁ బదార్ఢ- మోహమేలుడుగు దా ముదమేల కలుగు ॥చ2॥ ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్న ముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచు అందముగఁ దిరువేంకటాద్రీశు మన్ననల కఁదువెరిఁగినమేలు కలనైన లేదు |
రాగము: శుద్దవసంతం రేకు: 0036-07 సంపుటము: 1-226 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతం