
ఓహో ఢేంఢేం వొగి బ్రహ్మమిదియని – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఓహో ఢేంఢేం వొగి బ్రహ్మమిదియని సాహసమున శృతి చాటెడిని ॥చ1॥ పరమును నపరముఁ బ్రకృతియు ననఁగా వెరవు దెలియుటే వివేకము పరము దేవుఁడును అపరము జీవుఁడు తిరమైన ప్రకృతియె దేహము ॥చ2॥ జ్ఞానము జ్ఞేయము జ్ఞానగమ్యమును పూని తెలియుటే యోగము జ్ఞానము దేహాత్మ జ్ఞేయము పరమాత్మ జ్ఞాన గమ్యమే సాధించు మనసు ॥చ3॥ క్షరము నక్షరమును సాక్షి పురుషుఁడని సరవిఁ దెలియుటే సాత్వికము క్షరము ప్రపంచ మక్షరము కూటస్థుఁడు సిరి పురుషోత్తముఁడే శ్రీవేంకటేశుఁడు |
రాగము: రామక్రియ రేకు: 0082-04 సంపుటము: 1-396 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ