
ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఒక్కఁడే అంతర్యామి వుపకారి చేపట్టు తక్కినవి యిన్నియును తలఁపు రేఁచెడిని ॥చ1॥ యెఱుఁగుమీ జీవుఁడా యింద్రియాలు సొమ్ము గావు గుఱియై మాయలలోనఁ గూడించే వింతె మఱవకు జీవుడా మనసు చుట్టము గాదు తెఱఁగొప్ప ఆసలానే తిప్పెడి దింతె ॥చ2॥ తెలుకో జీవుఁడా దేహమును నమ్మరాదు వలసితే నుండుఁ బోవు వన్నెవంటిది తలఁచుకో జీవుడా ధనము దనిచ్చ గాదు పలులంపటములచేఁ బరచెడి దింతె ॥చ3॥ సమ్మతించు జీవుడా సంసార మొకజాడ గాదు బిమ్మటి పొద్దొకజాడ పెనచు నింతె యిమ్ముల శ్రీవేంకటేశ డితనిమూలమే యింత నెమ్మిఁ దానే గతియంటే నిత్యమవు నింతే |
రాగము: రామక్రియ రేకు: 0099-06 సంపుటము: 1-500 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ