ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము – అన్నమయ్య సంకీర్తన

ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము
తామసుండఁజుమ్మీ ముందరునున్నదైవమా
॥చ1॥
పాతకపుఁజేతులనే పట్టి నిన్నుఁ బూజించు-
ఘాఁతుకుఁడ నాకు నెక్కడి పుణ్యము
చేతనముఁ బోదిసేయుచిత్తము నీదేకాన
రాతిబొమ్మఁజుమ్మీ భారము నీది దైవమా
॥చ2॥
వూనినయెంగిలినోర నొప్పగునిన్నుఁ బొగడు-
హీనజంతువునకు నా కేఁటిపుణ్యము
తేనెవూసి నీ విట్లాఁ దిప్పఁగానే తిరిగేటి-
మానిబొమ్మఁజుమ్మీ నామతిలోనిదైవమా
॥చ3॥
జాలిఁబడి సంసారజలధిలో మునిఁగేటి
కూళఁడ నాకేఁటితేఁకువపుణ్యము
పాలువోసిపైంచిననాపాలి వేంకటేశనే
తోలిబొమ్మఁజుమ్మీ కాతువుగాని దైవమా
రాగము: ముఖారి
రేకు: 0047-01
సంపుటము: 1-286

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి

చదవండి :  చెల్లుఁగా కిటు నీకే చింతింపఁగా పూరి -

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *