
ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్ల – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ ఏమీ నడుగనొల్ల హెచ్చుకొందు లననొల్ల కామించి నీవిచ్చితివి కైవల్యపదము ॥చ1॥ పుట్టుగులకు వెఱవ భువిలోన హరి నీకు_ నట్టె నీదాసుఁడ నేనైతేఁ జాలు వెట్టికి నే జాతియైన వెఱవ నీనామములు వొట్టి నా నాలికమీఁద నుంటేఁజాలు ॥చ2॥ దురితాలకు వెఱవఁ దుద వేయైనా హరి నీ_ కరుణఁ గైంకర్యము గలిగితేఁ జాలు నిరతి నింద్రియాలకు నే వెఱవ నీ వాత్మఁ బెరరేఁపకుఁడవై పెరిగితేఁ జాలు ॥చ3॥ యేలోకమైనా వెఱవ యెప్పుడూ శ్రీవేంకటేశ పాలించి నీకృప నాపైఁ బారితేఁ జాలు కాలమెట్టయినా వెఱవ కర్మ మెట్టయినా వెఱవ యేలిన నీదాసులు నన్నియ్యకొంటేఁ జాలును |
రాగము: బౌళి రేకు: 0083-05 సంపుటము: 1-403 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, బౌళి