ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదు

॥పల్లవి॥
ఏమి సేయవచ్చుఁ గర్మమిచ్చినంతేకాని లేదు
తాముసేసినంత వట్టు తమకుఁ బోరాదు
॥చ1॥
ఇట్టునట్టు మిట్టిపడ్డ యించుకంతా లేదు, వీఁపు
బట్టగట్ట మోపు మోఁచి పాటువడ్డా లేదు
తట్టువడ లోకమెల్ల దవ్వుకొనినా లేదు
తెట్టఁదెరువున నోరుదెరచినా లేదు
॥చ2॥
అడిగి పరులబదు కాసపడ్డా లేదు, భీతి
విడిచి నెత్తుటఁదోగి వీరుఁడైనా లేదు
అడవులెల్లాఁ దిరిగి అలమటించిన లేదు
యిడుమపాటుకుఁ జొచ్చి యియ్యకొన్నా లేదు
॥చ3॥
వచ్చివచ్చి వనితల వలపించుకొన్నా లేదు
మెచ్చులగుఱ్ఱము నెక్కి మెరసినా లేదు
యెచ్చరికఁ దిరువేంకటేశుఁ గొలువక వుంటే
యిచ్చటనచ్చట సుఖ మించుకంతా లేదు
రాగము: సామంతం
రేకు: 0009-01
సంపుటము: 1-55

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతం

చదవండి :  దైవకృతంబట చేఁతట తనకర్మాధీనంబట

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: