ఏమి వొరలేరు యేమి మరలేదు – అన్నమయ్య సంకీర్తన

ఏమి వొరలేరు యేమి మరలేదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
ఏమి వొరలేరు యేమి మరలేదు
యీ మాయలంపటం బీఁదమోఁదనేకాని
॥చ1॥
సతులుగలమేలు దా సడిఁబొరలనేకాని
సతమైన సౌఖ్యస్వస్థానంబు లేదు
హితులు గలమేలు తా నిడుమఁబొరలనె కాని
హితవివేకము నరుల కెంతైన లేదు
॥చ2॥
తనువు లెత్తినమేలు తగులాయమేకాని
కనుఁగొనఁగ యోగభోగము గొంత లేదు
ఘనము గలమేలు తా గర్వాంధమేకాని
ఘనుఁడైన శ్రీనాథుఁ గనుగొనగ లేదు
॥చ3॥
చింతగలిగిన మేలు చివుకఁబట్టనెకాని
చింత వేంకటవిభునిఁ జింతించ లేదు
సంతు గలిగిన మేలు సంసారమే కాని
సంతతముఁ జెడని సద్గతిఁ జేర లేదు
రాగము: శుద్దవసంతం
రేకు: 0066-06
సంపుటము: 1-345

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతం

చదవండి :  ఏమీ నెఱఁగనినా కేడపుణ్యము - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: