ఎన్ని లేవు నా కిటువంటివి

॥పల్లవి॥
ఎన్ని లేవు నా కిటువంటివి
కన్నులెదుట నిన్నుఁ గనుగొనలేనైతి
go
read
read
॥చ1॥
అరయ నేఁజేసిన యపరాధములు చూచి
కరుణించి వొకడైనాఁ గాచునా
కరచరణాదులు కలిగించిననిన్నుఁ
బరికించి నీసేవాపరుఁడ గాలేనైతి
॥చ2॥
యేతరినై నేనెఱిఁగి సేసినయట్టి-
పాతక మొకఁడైనా బాపునా
ఆతుమలోనుండి యలరి నీవొసఁగిన-
చేతనమున నిన్నుఁ జెలఁగి చేరనైతి
॥చ3॥
శ్రీవేంకటేశ నేఁ జేసిన యితరుల-
సేవ కొకఁడు దయసేయునా
నీవే యిచ్చినయట్టి నే నీశరీరముతోడ
నీవాఁడ ననుబుద్ధి నిలుపనేరనైతి
రాగము: గౌళ
రేకు: 0005-03
సంపుటము: 1-31

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, గౌళ

చదవండి :  కొండలలో నెలకొన్న కోనేటిరాయఁడు వాఁడు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: