సోమవారం , 23 డిసెంబర్ 2024

ఎత్తులపై గళమెత్తు – సొదుం శ్రీకాంత్

ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు..

ఎత్తులపై గళమెత్తు
జిత్తులపై కలమెత్తు
పిడికిల్లే విచ్చు కత్తు

ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ..
ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..

రావాల్చిన రాజధాని..
రాకుండా పాయరా
వచ్చాయన్న సాగునీరు
మనది కాదు సోదరా
నిధులు లేని గడ్డరా
నిరుద్యోగ బిడ్డరా

ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు..
ఎత్తేత్తు… ఎత్తూ.. ఎత్తు..

నవ్యాంధ్ర ముసుగులో
రాయలసీమ బుగ్గిరా
వదిలావా పగ్గాలు
ఎద్దు నీది కాదురా
సేద్యం సెయ్యలేవురా
సేను బీడు ఆయరా
బతుకు మోయలేవురా..
ఓ అమ్మా ఓ అక్కా ఓ నాన్నా ఓ అన్నా
రాండి… రాండి …రాండి… రాండి …

చదవండి :  హవ్వ... వానా కాలంలో డెల్టాకు తాగునీటికొరతా?

రాయలసీమ పిలుచ్చాంది
రారండ్రో…రారండ్రో…రారండ్రో…రారండ్రో…
ఎత్తండ్రో…ఎత్తండ్రో…ఎత్తండ్రో…ఎత్తండ్రో…
గళమెత్తు..కలమెత్తు…పిడికిలెత్తు…కొడవలెత్తు
ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ..

ఇదెక్కడి దగారా
ఇంత వంచనేందిరా
మాయదారి రోగంరా
‘మనదారే ‘మందురా
ఉద్యమమే దిక్కురా
మరోదారి లేదురా
ఎత్తూ..ఎత్తూ… ఎత్తూ..ఎత్తూ..
ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..ఎత్తేత్తు…..

మన దాడి మొదలెట్టు
వాడి మత్తు వదలగొట్టు
మన ‘వాడి’ రుచి సూపు
వాడి తాడు ఇక తెంపు
రగులుతున్న అగ్నిగుండం
రాయలసీమ గడ్డరా
సల్లుకోకు, మల్లుకోకు
ఎల్లుకోని తేల్చుకో……

అహా…ఎహే…అహా…ఎహే
అద్దిఅదీ.. అదీ అదీ….అద్దిఅదీ.. అదీ అదీ….
అదో…అదో…అదో….అదో….
సీమ..సీమ..సీమ..సీమా…

చదవండి :  జై రాయలసీమ (కవిత) - సొదుం శ్రీకాంత్

రాయల.. సీమరా…
రా..రా..రా.. రాయలసీమ.. రా…రా..రా
ఎయ్….ఎయ్….ఎయ్…..ఎయ్
పులి అడుగు ఎయ్..ఎయ్..
తొక్కు..తొక్కు..తొక్కు..తొక్కు..
ఎత్తు..ఎత్తెత్తు…ఎతూఎతూఎతూఎతూ……….
ఎత్తెత్తు..ఎత్తెత్తు..ఎత్తెత్తు..
గళమెత్తు..కలమెత్తు…పిడికిలెత్తు…ఎలుగెత్తు….

ఇదీ చదవండి!

రాయలసీమలో హైకోర్టు

హైకోర్టు రాయలసీమలో ఎక్కడ? – రెండో భాగం

రాయలసీమలో హైకోర్టు కుండల్లో నీళ్ళు పొరుగు జిల్లాలకు, మబ్బుల్లో నీళ్ళు కడపకు గ్రోత్ సెంటర్స్‌గా ఎంపిక చెయ్యడానికి రాయలసీమలో ఎక్కడైనా …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: